5 Essential Refrigerator Buying Tips – ఫ్రిడ్జ్ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు


హలో అందరికి,

Refrigerator Buying Tips – ప్రతి మనిషి తన  రోజు వారి అవసరాలలో అతి ముఖ్యమైన వస్తువుగా మారిన ఫ్రిడ్జ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మరియు ఎలాంటి ఫ్రిడ్జ్ మనం కొనుగోలు చెయ్యాలి అదే విధంగా ఎలాంటి విషయాల పై దృష్టి పెడితే మనకి సరిపడే ఫ్రిడ్జ్ ని కొనుగోలు చెయ్యొచ్చు  అనే విషయాల పైన ఒక అవగాహన ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తాను .

5 Essential Refrigerator Buying Tips

Refrigerator Buying Tips

అయితే మన అందరికి ఒక వస్తువు కొంటున్నాము అంటే కచ్చితంగా ఆ వస్తువు మనకి ఎక్కువ రోజులు ఎలాంటి ఇబ్బంది రాకుండా మన్నిక ఉండేలా ఎంపిక చేసుకొని కొనాలి అనే అనుకుంటాం కానీ ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలో మనలో చాల మందికి తెలియక కొనుగోలు చేస్తుంటాం. 

అందుకే ఒక ఫ్రిడ్జ్ కొనాలి అంటే ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం. 

1. సైజు ( SIZE) :

ఒక 1-3 మనుషులు కలిగిన కుటుంబానికి  అయితే 90-250 లీటర్ capacity కలిగిన సింగల్ / డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. ఇందులో మనం కుటుంబానికి తగ్గ వారం రోజులకి సరిపడా కూరగాయలు, వాటర్ బాటిల్స్  మరియు స్నాక్స్ ని నిల్వ చేస్కోవచ్చు.

అదే 4-5 మనుషులు కలిగిన ఒక కుటుంబం అయితే మీరు 250-350 లీటర్ల డబుల్ డోర్ మోడల్ తీసుకోవడం సరైన నిర్ణయం ఎందుకు అంటే కుటుంబానికి తగ్గ నిత్యావసరాల సరుకులు అన్ని సమకూరుతాయి పెద్ద కూరగాయల storage box, స్నాక్స్, పచ్చళ్ళు, ఊరగాయలు ఇలా ఎన్నో ఇందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా సమకూరుతాయి.

మీది పెద్ద కుటుంబమా అయితే 350+ లీటర్ capacity ఉండే ఫ్రిడ్జ్ తీసుకోవడం ఉత్తమం. ఇందులో సైడ్ బై సైడ్ డోర్ మోడల్ మంచి ఎంపిక. కూరగాయలు, డైరీ సంబంధిత వస్తువులు, మాంసం సంబంధిత వస్తువులు అన్ని సరిపోయేలా ఈ ఫ్రిడ్జ్ ని డిజైన్ చేసి ఉంటారు. ఇందులోనే డ్యూయెల్ కూలింగ్ సిస్టమ్ లు ఉంటాయి. 

ఒకటి కూలింగ్ కోసం మరొకటి ఫ్రీజర్ కోసం, ఇది రుచులను తాజాగా మరియు ఐస్-ఫ్రీగా ఉంచడానికి సహాయపడుతుంది.

2. ఫ్రిడ్జ్ రకాలు ( TYPES ) :

a. టాప్ ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్లు (Top Freezer Refrigerators) :

ఈ రకమైన ఫ్రిడ్జ్ లు చాల తరచుగ వాడుకలో ఉంటుంది. ఇందులో ఫ్రీజర్ పైన భాగం లో ఉంటుంది ఆహారం ఉంచుకునే చోటు కింది భాగం లో ఉంటుంది , అలాగే ఇది మనకు  కరెంటు చార్జీలు ఆదా చేసేలాగా ఉంటుంది .

b. బాటమ్ ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్లు (Bottom Freezer Refrigerators) :

ఇందులో ఫ్రీజర్ భాగం క్రింద ఉంటుంది. ఆహార పదార్ధాలు ఉంచుకునే ప్రదేశం పైన భాగం లో ఉంటుంది .కానీ ఫ్రీజర్ ఉపయోగించేటప్పుడు కొద్దిగా కష్టతరంగా అనిపిస్తుంది.

c. సైడ్-బై-సైడ్ రెఫ్రిజిరేటర్లు (Side-by-Side Refrigerators) :

ఈ ఫ్రిడ్జ్ చూడటానికి చాల భిన్నంగా  ఉంటుంది ఎలాగ అంటే మన ఇంట్లో వాడే బీరువా లాగా ఉంటుంది. ఒక పక్క రెఫ్రిజిరేటర్ ఇంకో పక్కన ఫ్రీజర్ ఉంటుంది. ఈ మోడల్ వల్ల ఉపయోగం ఏంటంటే చాల తక్కువ స్థలం లో కూడా సులభంగా వాడుకోవచ్చు కానీ మిగతా మోడల్ ఫ్రిడ్జ్లతో పోల్చుకుంటే ఇది మనకు కరెంటు ఛార్జ్ లు పరంగా అంత మెప్పించవు. 

d. ఫ్రెంచ్ డోర్ రెఫ్రిజిరేటర్లు (French Door Refrigerators) :

బెస్ట్ LAPTOP ను ఎంచుకోవడం ఎలా?
How to Choose Best Laptop in 2025? – బెస్ట్ LAPTOP ను ఎంచుకోవడం ఎలా?

ఈ రకం ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది అంటే 2 డోర్ లు మరియు 1 లేదా 2 డ్రా లు ఉంటాయి. పైన డోర్ లు సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ లనే పనిచేస్తుంది దానితో పాటు కింద ఉన్నటువంటి డ్రా లు మరింత వస్తువులు వినియోగించడానికి ఉంటుంది. ఇది చూడటానికి చాలా గొప్పగా ఉన్నట్టు కనిపిస్తుంది, దానికి తగ్గట్టు గానే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.

e. కాంపాక్ట్/మిని రెఫ్రిజిరేటర్లు (Compact/Mini Refrigerators) :

ఈ రకం ఫ్రిడ్జ్ లు అయితే ఇంటికి వాడటానికి అయితే తగదు, మిగతా ఫ్రిడ్జ్ లతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది ఎలా అంటే 4 వాటర్ బాటిల్స్ కొన్ని పండ్లు / కూరగాయలు ఉంచుకునేంత సైజు లోనే ఉంటుంది. ఇది రూమ్స్ లో ఆఫీస్ లో వాడటానికి చాల సులభం అయినది. ధర కూడా చాల తక్కువ లో ఉంటుంది.

f. స్మార్ట్ రెఫ్రిజిరేటర్లు (Smart Refrigerators) :

ఈ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ మిగతా రిఫ్రిజిరేటర్స్ తో పోల్చుకుంటే ఇందులో ఉన్న అత్యాధునిక  ఫ్యూచర్స్ వైఫై, టచ్ స్క్రీన్, స్మార్ట్ హోమ్  ఇలాంటి ప్రత్యేకమైన ఉపయోగాలు వల్ల ఇది ప్రాధాన్యం పొందింది.  ఫ్రిడ్జ్ తెరవకుండానే లోపల ఉన్న వస్తువులు తెలుసుకోవచ్చు, టెంపరేచర్ ని మార్చుకోవచ్చు ఇలాంటి చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా చాలా ఉపయోగాలు పెరగొచ్చు కరెంటు చార్జీలు సరసమైన విధంగానే ఉంటుంది ధర కూడా అధికంగానే ఉంటుంది. 

 
ఈ ఫ్రిడ్జ్ రకాల గురించి మీకు తెలియపరచడమేంటంటే ప్రతి ఒక్క మోడల్ ఫ్రిడ్జ్ దాని యొక్క ప్రాధాన్యం బట్టి ఉంటుంది కానీ ఇందులో మనం మన కుటుంబానికి వాడుకకి తగిన విధంగా ఎంచుకుంటే సరిపోతుంది!

3. కరెంటు చార్జీలు ( BILLS ) :

కరెంట్ బిల్ గురించి భయపడుతున్నారా! అయితే మనకు సరైనది 4 స్టార్ లేదా 5 స్టార్ BEE – రేటెడ్  ఫ్రిడ్జ్ తీసుకోండి, ఎందుకంటే ఇది కరెంటు చార్జీలను 20% నుంచి 30% తగ్గిస్తుంది. దానికి కారణం ఏంటంటే 5 స్టార్ మోడల్ ఫ్రిడ్జ్ 3 స్టార్ మోడల్ ఫ్రిడ్జ్  కంటే 40% కరెంటు ని తక్కువ వాడుతుంది.  

దీనితో  పాటు మీరు తీసుకునే ఫ్రిజ్లో ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండేలా  చూసుకోండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది మన ఫ్రిడ్జ్ యొక్క కూలింగ్ స్పీడ్  ని దానంతట అదే పెంచుతుంది మరియు  తగ్గిస్తుంది. దీనివల్ల మనకి ఒక సంవత్సరం పరంగా చూసుకుంటే 3000/- నుంచి 5000/- వరకు చార్జీలను ఆదా చేస్కోవచ్చు.  మీరు ఒక ఫ్రిడ్జ్ కొనే  ముందు బయట అందుబాటులో ఉన్న వేరే వేరే బ్రాండ్స్ ని చెక్ చేసి కొనండి, కొన్ని బ్రాండ్స్ స్టెబిలైజర్ అవసరం లేకుండా వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయినా తట్టుకునేలా తయారుచేయబడి ఉన్నాయి. 

4. ధరలు ( Budget ) :

సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే 12000/- నుంచి ప్రారంభమవుతుంది. 

అదే ఒక ఫ్యామిలీకి అనుగుణంగా ఉండేలా ఫ్రిడ్జ్ కొనుగోలు చెయ్యాలి అనుకుంటే  25000/- నుంచి 50,000/- దాకా ఉంటుంది.  50,000/- పైన  ధర పెట్టి కొనుగోలు చెయ్యాలి అనుకుంటే అందులో స్మార్ట్ ఫీచర్స్ ఉండేలా జాగ్రత్త పడండి. 

ఈ సందర్భంగా మీకు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను  ఫ్రిడ్జ్ కొనే ముందు భవిష్యత్తులో ఏమైనా దీపావళి సేల్స్, రిపబ్లిక్ డే  సేల్స్, మెగాసేవింగ్స్, ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ బిగ్ బిలియన్ డేస్, ఫ్రీడమ్ సేల్స్, క్లియరెన్స్ సేల్స్ ఇలాంటి సేల్స్  ఉన్నాయా లేదా అని చూసుకోండి.  అందులో కూడా క్రెడిట్ కార్డ్స్, EMI ఆఫర్స్ ఉంటాయి, దాని వాళ్ళ  2000/- నుంచి 3000/- దాకా ధర తగ్గించుకునే అవకాశం ఉంది.

5. ఫీచర్స్ ( Features ) :

అడ్జస్ట్మెంట్ షెల్ఫ్ : మనం వాడుకునే వస్తువులను బట్టి ప్లేస్ వినియోగించడానికి యూస్ అవుతుంది.

ఎనర్జీ ఎఫిషియెన్సీ : కరెంటు చార్జీలు ఇక్కడ మనం తీసుకునే స్టార్ రేటింగ్ ని బట్టి ఉంటుంది, ఎక్కువ రేటింగ్ ఉంటె తక్కువ ఛార్జ్, తక్కువ రేటింగ్ ఉంటె ఎక్కువ ఛార్జ్.

టెంపరేచర్ కంట్రోల్ అండ్ జోన్స్ : ఇది ఫ్రిడ్జ్ లోపల టెంపరేచర్ని తగినవిధంగా మార్చుకోవటానికి   యూజ్ అవుతుంది.

The Ultimate tips to buy best AC in 2025
The Ultimate tips to buy best AC in 2025 – బెస్ట్ AC కొనడానికి టిప్స్ 2025

డోర్ అలారం: డోర్ అలారం అనేది మనం తెలిసి తెలియక డోర్పని ఓపెన్ లో ఉంచేసినట్లైతే ఇది మనకు బజ్జర్ సౌండ్ ని ఇస్తుంది.
 

స్పిన్ ప్రూఫ్ షెల్ఫ్: ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైనా తేమ కలిగిన వస్తువులు ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే అందులో నుండి నీరు ఫ్రిడ్జ్ కి వ్యాపించకుండా కాపాడుతుంది.

హ్యూమిడిటీ కంట్రోల్డ్ క్రిస్పెర్స్ : ఇది ఎందుకు యూస్ అవుతుంది అంటే  మన ఫ్రిడ్జ్ లో ఉంచుకునే కూరగాయలు లేదా ఆకుకూరల యొక్క తేమ సాంద్రతకి అవి తట్టుకునే విధంగా ఫ్రిజ్ లోపల తేమని నిల్వ చేయగలుగుతుంది.

ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టం : ఈ సిస్టం ద్వారా ఏదైనా వస్తువుల లేదా కూరగాయల యొక్క దుర్వాసన ని  ఫిల్టర్ చేసి, ఆ దుర్వాసన రాకుండా తగ్గిస్తుంది.

చైల్డ్ లాక్ : ఈ చైల్డ్ లాక్ అనేది ప్రతి ఇంటికి అవసరమే దీని వల్ల చిన్న పిల్లలు తరచూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం తగ్గుతుంది.

క్విక్ కూల్ ఫ్రీజ్ ఫంక్షన్ : ఈ ఫంక్షన్ వల్ల మనకి తక్కువ సమయం లో త్వరగా వస్తువులను కూల్ చేస్కోవచ్చు. 

6. ప్రధాన విషయాలు ( Things to consider ) :

మ్యానుఫ్యాక్చరర్స్ వారంటీ :  కనీసం 1సంవత్సరం ఉండేలా చూసుకోవాలి.

కంప్రసర్ వారెంటీ :  ఇది 5 నుంచి 10 సంవత్సరాలు ఉండేలా చూసుకోవాలి. 

వోల్టేజ్  స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ : ఇది కచ్చితంగా ఫ్రిడ్జ్ లో ఉండేటట్టు చూసుకోండి దీనివల్ల ఏంటంటే వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు స్టెబిలైజర్ లేకపోయినా కూడా ఫ్రిడ్జ్ అనేది డామేజ్ అవ్వకుండా ఉంటుంది. 


సర్వీస్ అవేలబిలిటీ : ఒక ఫ్రిడ్జ్ కొనే ముందు మీ ప్రాంతంలో ఆ బ్రాండ్ యొక్క సర్వీస్ అనేది అందుబాటులో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. 


సేఫ్టీ : ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా ఒక గోడ నుంచి లేదా ఒక ప్రదేశం నుంచి కొంచెం ముందు ఉండేటట్లు చూసుకోండి ఎందుకనగా మన ఫ్రిడ్జ్ లో జరిగే పరిణామాలు ఫ్రిడ్జ్ బయట ప్రభావం చూపిస్తుంది అందుకోసం ఫ్రిడ్జ్ కి ఎల్లప్పుడు ఎయిర్ వెంటిలేషన్ అనేది తప్పని సరిగా ఉండాలి. 

7. ముగింపు ( Conclusion ):

చివరగా మనం ఫ్రిడ్జ్ కొంటున్నాం అనుకున్నప్పుడు మనకు ఆ ఫ్రిడ్జ్ వల్ల ఎంతవరకు ఉపయోగముందో దానిని దృష్టిలో ఉంచుకుని, ఆ ఫ్రిడ్జ్ మన కుంటుంబానికి తగినట్టు సైజు ని ఎంపిక చేసుకొని  అలాగే ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ కొరకు ఎంతవరకు స్థలం కేటాయించగలమో దానికి తగినట్టు ఉంచుకొని, ఆ వస్తువుపై ఎంత వరకు ఖర్చు చేయగలమో అంచనా వేసుకొని ఖరీదు చేస్తారు అని కోరుకుంటున్నాను. 

ఇలాంటి TECH ఇన్ఫర్మేషన్ మరిన్ని తెలుసుకోవాలంటే subscribe చేసుకోండి.

2 thoughts on “5 Essential Refrigerator Buying Tips – ఫ్రిడ్జ్ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు”

Leave a Comment