Hello కుటుంబ సభ్యులారా, The Ultimate tips to buy best AC in 2025! ఆర్టికల్ కి స్వాగతం
ఇది ఊహించుకోండి 2025 ఏప్రిల్ లో, ఎండ కి భూమి మొత్తం కరిగిపోయేలా ఉన్నప్పుడు, భరించ లేని వేడి సెగ ఉన్నప్పుడు. దాని నుంచి తప్పించుకోడాకిని మన బ్రెయిన్ లో వచ్చే మొదటి ఆలోచన AC లేదా కూలర్.
కూలర్ కొనాలి అంటే మన దగ్గర్లోని షాప్ కి వెళ్లి విచారించిన మనకు Best వస్తువు దొరికేస్తుంది.
అదే ఒక AC కొనాలి అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.

The Ultimate Tips to Buy the Best AC in 2025
ఈ ఆర్టికల్ the ultimate tips for buying the best AC in 2025 లో మీకు సరిపడే AC ని మీరు ఎంచుకునేలా మేము
When considering The Ultimate tips to buy best AC in 2025, it’s crucial to analyze various factors that will affect your choice.
1. రూమ్ సైజ్ ( ROOM SIZE ) :
మొట్ట మొదటి విషయం మీ రూమ్ యొక్క సైజు ఎంత అని తెలుసుకోండి.
ఇది దీనికి ఎలా సంబంధం అంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను. మీ పాదం 8 inch అయితే మీరు 7 inch చెప్పులు కొంటె అది బిగుసుకుంటుంది అలాగే 9 inch చెప్పులు కొంటె చాలా వదులుగా ఉంటుంది అలానే దానికి పెట్టిన డబ్బులు కూడా వృధా అవుతుంది.
AC విషయంలో కూడా అంతే మీ రూమ్ కి సరిపడా AC ని కొంటేనే మీరు దానిని సంపూర్ణంగ వినియోగించవచ్చు. అది పనిరీత్యా అయినా కరెంటు ఛార్జ్ పరంగా అయిన.
టన్ను ( Ton ) :ఈ టన్ అనే ఒక పరిణామం ఒక AC కొనుగోలు చేయడంలో చాల ముఖ్య విషయం, అసలు ఈ టన్ అంటే ఏంటో మీకు చెప్తాను.
24 గంటల్లో ఒక రూమ్ ని చల్లదనంతో నింపడానికి ఎన్ని టన్నుల ఐస్ గడ్డ ని కరిగించాలి అనేదే ఈ టన్ అనే అంశం.
చిన్న రూమ్ : (150 – 250 చ.అడుగులు ) : 0.5 – 0.7 Tons
మీడియం రూమ్ : (400 – 550 చ.అడుగులు ) : 1 – 1.5 Tons
పెద్ద రూమ్ : (700+ చ.అడుగులు ) : 2+ Tons
Tip : మీ రూమ్ చిన్న రూంకి మీడియం రూమ్ కి మధ్యలో ఉంటె మీడియం రూమ్ కి సరిపడా AC నే ఎంచుకోండి, ఆలా చేసినట్లయితే మీ AC ని పని ఒత్తిడి నుంచి తప్పించినవారు అవుతారు.
2. AC రకాలు ( AC Types ) :
Split AC : ( 1 – 2 Ton ) :
- ఈ Split AC ని మనం చిన్న మరియు మీడియం రూమ్ కి వాడుకోవచ్చు. ఒకవేళ పెద్ద రూమ్ అయితే Split AC లో ఎక్కువ టన్ను ఉండే AC ని ఎంచుకుంటే సరిపోతుంది.
- ఈ Split AC లో శబ్దం చేసే పరికరం అయిన కంప్రెసర్ ( Outdoor Unit ) ఇంటికి బయట ఉంచుతాం. అందువల్ల మనకి రూమ్ లో ఉండే AC ( Indoor Unit ) నుంచి శబ్దం తగ్గుతుంది, మొత్తానికి నిశబ్ధంగానే పనిచేస్తుంది.
- Energy Efficiency Ratio ( ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో ) : ఈ EER ని ఎక్కువ ఉండేలా చూసుకోండి, లేదా స్టార్ రేటింగ్ 5⭐ లేదా 4⭐ ఉండేలా ఎంచుకోండి.
గమనించండి ఏ ఎలక్ట్రికల్ వస్తువులైనా 5⭐ లేదా 4⭐ఉండేలాగానే చూసుకోండి ఎందుకంటె ఎక్కువ రేటింగ్ ఉంటె తక్కువ కరెంటు ఛార్జ్ వస్తుంది.
- రూపం : ఈ split ac పనితీరుకే కాకుండా చూడటానికి కూడా చాల ఆకర్షణీయంగా ఉంటుంది మీ రూంకి ఇంకొంచెం అందాన్ని యాడ్ చేస్తుంది.
- Air Quality : ఈ మధ్యకాలం లో చాలా split ac ల్లో ఆధునికమైన ఫిల్టర్లు తో వస్తున్నాయి. దీనివల్ల మన రూమ్ లో ఉండే ఎయిర్ క్వాలిటీ, అలెర్జీ లు, బాక్టీరియాలను తొలగిస్తుంది.
ఏ వస్తువైనా లాభాలు ఎన్ని ఉంటాయో నష్టాలూ కూడా అన్నే ఉంటాయి. ఈ split ac లో నష్టాలు ఏంటో చూద్దాం.
- ఈ Split AC యొక్క ధర ఎక్కువే ఉంటుంది దానితో పాటు ఇంటికి అమర్చుకోడానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. కానీ ఖర్చుకి తగ్గ పెరఫార్మన్సుని ఇస్తుంది.
- ఇంస్టాల్లేషన్ అనేది చాల శ్రమతో కూడుకున్న విషయం కచ్చితం గ ఒక నిపుణులు ఉండాల్సిందే కానీ మనం AC కొన్నప్పుడు ఆ విక్రయదారుడే మనకి నిపుణుడితో పరిచయం ఏర్పాటు చేస్తారు.
- Outdoor Unit ని సరైన ప్రదేశం లో ఉంచడం చాల ముఖ్యం ఎందుకంటే,
ఆ పరికరం సరైన ఎండ మరియు గాలి అందే ప్రదేశంలో అమర్చడం తప్పనిసరిగా చూసుకోవాల్సిన విషయం.ఇంకొక అంశం ఏంటంటే మన చుట్టుపక్కన ఇల్లు ఉన్న వాళ్ళకి ఆ Outdoor Unit నుంచి వచ్చ్చే శబ్దం ఇబ్బంది కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి.
Window AC : ( 0.5 – 1.5 Ton ) :
- ఈ విండో AC ధర పరంగా చాలా అందుబాటులో ఉంటుంది.
- ఇంటికి అమర్చుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది, ఇంటిని అదనంగా మార్పు చెయ్యాల్సిన అవసరం ఉండదు.
- చిన్న రూమ్ లకు అయితే ఇది ఉత్తమమైనది, రూమ్ లో ఈ AC చాల తక్కువ స్థానాన్నే వినియోగిస్తుంది.
- మెయింటనెన్స్ కి కూడా చాలా సహకరిస్తుంది. అన్ని పరికరాలు ఇంటిలోనే ఉనందువల్ల సర్వీస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది.
- వేరే రూమ్ కో లేదా వేరే ఇంటికో మార్చుకోవాలి అన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది లేకుండా సులభంగానే అయిపోతుంది.
ఈ AC నష్టాలు చూద్దాం
- కంప్రెసర్ ఒక చోట ఉండటం వల్ల శబ్దం అనేది ఉంటుంది.
- పెద్ద రూమ్ లకి అంత సరియైనది కాదు, ముఖ్యంగా ఈ AC గనుక సరిగ్గా అమర్చక పోతే, బయటి వ్యక్తులు సులభంగా దొంగతనం చేయడానికి వీలుగా ఉంటుంది.

Portable AC : ( 0.5 – 1 Ton ) :
- ఈ Portable AC కి ఎలాంటి స్థిరమైన ఇంస్టాల్లేషన్ అవసరం లేదు ఒక సూటుకేసు లాగా అనుకోండి.
- సులభంగా ఏ రూమ్ కి కావాలంటే ఆ రూమ్ కి మార్చుకోవచ్చు.
- ఈ రకమైన AC లో ప్రస్తుతం రూమ్ ని చల్లగా చెయ్యడానికి వేడిగా చెయ్యడానికి ఇలా చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి.
- నష్టాలు కూడా ఉన్నాయ్ చూసేద్దాం
- శబ్దం కచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అన్ని పరికరాలు ఒకే చోట ఉంటాయి కాబట్టి.
- కరెంటు ఛార్జ్ లు ఎక్కువగానే ఉంటుంది మిగతా AC తో పోల్చుకుంటే.
- కూలింగ్ తక్కువగానే ఉంటుంది చిన్న రూమ్ లకి అయితే సరిపోతుంది.
Central AC : ( 2+ Ton ) :
- ఈ AC , మొత్తం AC రకాల అన్నింట్లో చాలా పెద్దది.
- ఇది అమర్చడం కూడా చాలా కష్టభరితమైన విషయం, కానీ ఒక పెద్ద ఇల్లు లేదా ఒక ఆఫీస్ లకు ఇది బాగా సరిపోతుంది.
- ఇల్లు అయితే ప్రతీ రూమ్ కి కూల్ ఎయిర్ వచ్చేలా సెటప్ చేసుకోవచ్చు.
- అలాగే ఒక్కో రూమ్ కి ఒక్కో టెంపరేచర్ ఎంచుకునేలా ఉంటుంది.

3. ఇన్వెర్టర్ Tech., ఆ నాన్ ఇన్వెర్టర్ Tech., ఆ ?
( Inverter or Non-Inverter ? ) :
ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక AC కొనుగోలు చెయ్యడంలో, అసలు ఈ ఇన్వెర్టర్ అంటే ఏంటి ణొన్ ఇన్వెర్టర్ అంటే ఏంటో చూసేద్దాం.
ఇన్వెర్టర్ Tech., ( Inverter ) :
- ఇన్వెర్టర్ AC లో కంప్రెసర్ వివిధ రకాల వేగం తో పని చేస్తుంది.
- మన రూమ్ లో ఉన్న వేడిని బట్టి ఈ కంప్రెసర్ పని చేసి మన రూమ్ లో చల్లదనాన్ని మైంటైన్ చేస్తుంది.
- ఈ ఇన్వెర్టర్ AC కరెంటు చార్జీలను తగ్గించటంలో తోడ్పడుతుంది.
- ఇన్వెర్టర్ AC శబ్దం చాలా తక్కువ ఉంటుంది, అలాగే కంప్రెసర్ దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి AC ఒక్క లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది.
- రూమ్ కూలింగ్ కూడా చాలా త్వరగా పనిచేస్తుంది.
నాన్ ఇన్వెర్టర్ Tech., ( Non – Inverter ) :
- నాన్ ఇన్వెర్టర్ AC లో కంప్రెసర్ ఒకే వేగం తో పని చేస్తుంది.
- మన రూమ్ లో ఉన్న వేడిని తగ్గించటం కోసం ఈ కంప్రెసర్ దాని అత్యధిక వేగం తో పనిచేసి off అయిపోతుంది. మళ్ళీ వేడి పెరిగినప్పుడు మరలా on అయి పనిచేస్తుంది.
- ఈ ఇన్వెర్టర్ AC కరెంటు చార్జీలను తగ్గించటంలో సరి అయినది కాదు.
- ఇన్వెర్టర్ AC శబ్దం ఇన్వెర్టర్ మోడల్ తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది, అలాగే కంప్రెసర్ తరచూ ఆన్ / ఆఫ్ అవ్వటం వల్ల AC యొక్క లైఫ్ తగ్గుతూ ఉంటుంది .
- రూమ్ కూలింగ్ కూడా నిదానంగా పనిచేస్తుంది.
4. ధర ( Budget ) :
Split AC :
డైకిన్ 1.5 టన్ 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
- ధర: ₹48,999
- ముఖ్య లక్షణాలు: పవర్ చిల్ ఆపరేషన్, కాపర్ కండెన్సర్, కోండా ఎయిర్‌ఫ్లో టెక్నాలజీ, ఇంటెలిజెంట్ ఐ సెన్సార్.
LG 1.5 టన్ 6-స్టార్ AI కన్వర్టిబుల్ split AC
- ధర: ₹52,499
- ముఖ్య లక్షణాలు: AI- ఆధారిత కూలింగ్, 6-ఇన్-1 కూలింగ్ మోడ్‌లు, UV నానో టెక్నాలజీ, డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్.
Window AC :
వోల్టాస్ 1.5 టన్ 5-స్టార్ విండో AC
- ధర: ₹34,690
- ముఖ్య లక్షణాలు: అధిక శక్తి సామర్థ్యం, మన్నికైన నిర్మాణం.
లాయిడ్ 1.5 టన్ 3-స్టార్ విండో AC
- ధర: ₹28,990
- ముఖ్య లక్షణాలు: నమ్మదగిన కూలింగ్, మంచి ఎయిర్‌ఫ్లో.
Inverter AC :
క్యారియర్ 1.5 టన్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
- ధర: ₹40,800
- ముఖ్య లక్షణాలు: శక్తి-సమర్థవంతమైన, నిశ్శబ్ద ఆపరేషన్.
IFB 1.5 టన్ 5-స్టార్ ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
- ధర: ₹55,490
- ముఖ్య లక్షణాలు: ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ, అధిక శీతలీకరణ సామర్థ్యం.
Portable AC :
- పోర్ట్రబుల్ AC మార్కెట్ లో మనకు 19,000/- నుంచి 38,000/- వరకు ఉంటుంది కానీ 1 టన్ను లో ఉంటుంది.
Central AC :
- 1 BHK అపార్ట్‌మెంట్ కోసం, నిర్దిష్ట అవసరాలు మరియు మీరు ఎంచుకున్న బ్రాండ్ ఆధారంగా మొత్తం ఖర్చు ₹1,00,000 నుండి ₹1,50,000 వరకు ఉంటుంది.
5. ఫీచర్స్ :
మీరు కొనే AC లో ఈ ఫీచర్స్ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
- WiFi ఫీచర్ మీరుకొనే AC లో ఉండేలా చూసుకోండి అలాగే App ఫీచర్ ఉండేలా చూసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఉన్న చోటు నుంచే మీ మొబైల్ నుంచి చల్లదనాన్ని ఎంచుకునేలా చేసుకోవచ్చు.
- ఎయిర్ ఫిల్టర్ ఫీచర్ ఉండటం అవసరం ఈ ఎయిర్ ఫిల్టర్ గాలి లో ఉండే దుమ్ము మరియు బాక్టీరియా ని తొలగించటంలో తోడ్పడుతుంది.
- స్లీప్ మోడ్ ఫీచర్ వాళ్ళ ఉపయోగం మనం నిద్రిస్తున్న సమయం లో మన రూమ్ లో వేడి ని AC దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటుంది.
6. వారెంటీ :
మన కొనే ప్రతి వస్తువుకు వారెంటీ అనేది చాలా కీలకమైన విషయం AC ధర ఎక్కువ పెట్టి కొనే వస్తువు కాబట్టి ముఖ్యంగా ఇది గమనించాలి.
- ప్రామాణిక వారంటీ: చాలా ACలు మొత్తం యూనిట్‌ను కవర్ చేసే 1-సంవత్సరం సమగ్ర వారంటీతో వస్తాయి.
- కంప్రెసర్ వారంటీ: కంప్రెసర్ ఒక కీలకమైన భాగం, మరియు అనేక బ్రాండ్లు దీనికి ప్రత్యేకమైన, ఎక్కువ సంవత్సరాలు వారంటీని అందిస్తాయి, సాధారణంగా 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటాయి.
7. మెయింటనెన్స్ :
ఒక AC ని ఎలా వాడుకుంటే దాని యొక్క లైఫ్ మెరుగుపడుతుంది మరియు కూలింగ్ తగ్గకుండా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం.
- ఫిల్టర్స్ ని ప్రతి 2 వారాలకు ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి, ఇలా చేసినట్లయితే కూలింగ్ తగ్గకుండా దుమ్ము ఏర్పడకుండా ఉంటుంది.
- Outdoor Unit ని 2 నెలలకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, ఆలా చేసుకున్నట్లు అయితే కంప్రెసర్ పని తీరు పాడవకుండా ఉంటుంది.
- ప్రతి సంవత్సరానికి ఒకసారి AC యొక్క వైరింగ్ మరియు కూలింగ్ రెఫ్రిజిరంట్ ని పరిశీలన చేసుకోండి.
మీకు ఒక చిట్కా మీరు AC సర్వీసింగ్ చెయ్యాలి అనుకున్నట్లైతే వేసవి కాలమ్ కి 1 నెల ముందు చేయించుకోండి, ఎందుకంటే వేసవి కాలమ్ వచ్చేసరికి సర్వీస్ ఏజెంట్లు సమయం కేటాయించలేరు.
కొన్ని సలహాలు :
సరైన AC ని కొనటం అంత పెద్ద కష్టమైన పనికాదు.
- మార్కెట్ లో ఉన్న వివిధ AC మోడల్స్ ని ఒక దానితో ఒకటి పోల్చుకోండి.
- ఆన్లైన్ లో రివ్యూ లను చూడండి. ఆఫ్ లైన్ లో ఇద్దువరకే వాడేవారిని వారి AC యొక్క పనితీరు, కరెంటు చార్జీల గురించి తెలుసుకోండి.
- మీ యొక్క రూమ్ కి తగినట్టు మరియు మీ అవసరాలకు తగినట్టు AC ని కొనుగోలు చెయ్యండి.
- అత్యవసరం అయితే మీరు ఆఫ్ లైన్ లో లేదా ఆన్లైన్ లో మీకు కావాల్సిన AC ధరని పోల్చుకొని ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చెయ్యండి.
- లేదా మీరు కొనుగోలు చెయ్యాలనే ఆలోచనలో ఉంటే ఆన్లైన్ లో వచ్చే సేల్స్ వరకు వేచి ఉండటం ఉత్తమము. ఎందుకంటే Amazon మరియు Flipkart లో సేల్స్ అప్పుడు ధర తగ్గుతుంది, credit card వాడుతున్నట్లయితే మీకు అదనంగా 2000/- నుంచి 3000/- వరకు ధర తగ్గుతుంది.
మీరు ఒక సంతృప్తికరమైన కొనుగోలును నిర్ధారించుకోవడానికి the ultimate tips for buying the best AC in 2025 చిట్కాలను గుర్తుంచుకోండి.
ముగింపు :
మనం AC కొనుగోలు చేస్తున్నాం అని నిర్ణయించుకున్నాక మన రూమ్ పరిమాణం ఎంత, ఏ రకమైన AC మన ఇంటికి సరిపోతుందో , ఎంత టన్ను అయితే సరిగ్గా ఉంటుందో, మనం ఎంచుకున్న AC కి 5 స్టార్ రేటింగ్ ఉందా, స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయా, మనం ఎంచుకున్న మోడల్ కి ఈ ధర సరియైనదేనా, వారెంటీ అన్ని ఉన్నాయా అని మొత్తం చెక్ లిస్ట్ చూసుకొని కొనుగోలు చేసుకుంటారని ఆశిస్తున్నాను.
నా నుంచి ఒక సలహా నేను గమనించిన AC బ్రాండ్స్ లో Daikin అనే బ్రాండ్ AC లు తక్కువ కస్టమర్ కంప్లైంట్ తో సరసమైన ధరకే లభిస్తుంది.
Samsung, LG, LLOYD, Voltas లాంటి చాలా పెద్ద బ్రాండ్స్ మార్కెట్ లో ఉన్నాయి, వాటి యొక్క కస్టమర్ రివ్యూస్ ని బట్టి సరియైన AC ని ఎంచుకోండి.
The ultimate tips to buy the best AC in 2025 చిట్కాలను అమలు చేయడం వల్ల మీ డబ్బు ఆదా కావడమే కాకుండా మీ సౌకర్య స్థాయిలు కూడా పెరుగుతుంది .
మీరు ఒక బెస్ట్ ఫ్రిడ్జ్ కొనాలి అనుకుంటున్నారా అయితే ఈ బ్లాగ్ ని పరిశీలించండి.
5 Essential Refrigerator Buying Tips
By following The Ultimate tips to buy best AC in 2025, you will not only save money but also enhance your comfort levels significantly.
These are The Ultimate tips to buy best AC in 2025 that can guide you toward making a wise purchase.